MENU

Pages

Menu

February 16, 2016

హిట్లర్ అన్నయ్యలతో ఇబ్బందే అన్న హీరోయిన్


ముంబై :
తన అన్నలు ఎప్పుడూ తనను సంరక్షించాలని చూడటం, తనను నీడలా వెంటాడటం అప్పుడప్పుడు ఇబ్బందిగానే అనిపిస్తోందని బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ చెబుతోంది. బాలీవుడ్ హీరో అనిల్ కపూర్, సునితాకపూర్‌ల కూతురైన సోనమ్‌కు సొంత అన్న హర్షవర్ధన్ కపూర్‌తో పాటు, పెదనాన్న కొడుకులు అర్జున్ కపూర్, మోహిత్ కూడా ఉన్నారు. ఇంతమంది అన్నయ్యలు ఉండటం, వాళ్లతో కలిసి పార్టీలు చేసుకోవడం చాలా కష్టమని.. వాళ్లు ఎప్పుడూ తనను కాపాడాలని చూస్తుండటం ఇబ్బందిగా అనిపిస్తుందని సోనమ్ ఓ టీవీ షోలో చెప్పింది.

దీనివల్ల తన మగ స్నేహితులు కూడా అన్నల్లాగే మారిపోతున్నారని వాపోయింది. వేరే మగాళ్లు ఎవరినీ వాళ్లు పరిచయం చేయడం లేదని, ఏ అబ్బాయితోనూ క్లోజ్‌గా తిరగనివ్వడం లేదని చెప్పింది. అర్జున్ కపూర్ హీరోగా చాలా కూల్‌గా కనిపించినా, అన్నగా మాత్రం అస్సలు కూల్ కానే కాదని కుండబద్దలుకొట్టింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఆ అబ్బాయిని తనకు పరిచయం చేయాలని చెబుతుంటాడని చెప్పింది.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

No comments:

Post a Comment