మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పండుగ మొదలుకానుంది. ధనాధన్ షాట్లు.. బౌండరీల ప్రవాహంతో టీ20 ప్రపంచకప్ ప్రేక్షకుల ముందుకురానుంది. క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లో తొలిసారి పొట్టిఫార్మాట్‌లో ప్రపంచకప్ జరుగుతుండడం.. టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండడంతో ఈ టోర్నీ సూపర్‌హిట్ అవుతుందనడంతో సందేహం లేదు. పెద్ద జట్లన్నీ పాల్గొనే మ్యాచ్‌లన్నీ మార్చి 15నే మొదలుకానున్నా.. రేపటి నుంచి తొలిరౌండ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో గత టోర్నీలో కొన్ని హైలైట్స్‌ను మరోసారి గుర్తు చేసుకుందాం..
అసలు టీ20 ఫార్మాట్‌లో నిర్వహించిన తొలి ప్రపంచకప్ ఆరంభమే అదుర్స్ అని చెప్పాలి. అప్పటివరకు ఒక స్టార్‌గా మాత్రమే ఉన్న క్రిస్ గేల్ ఆ మ్యాచ్‌తో సూపర్‌స్టార్‌గా మారిపోయాడు. విధ్వంసక వీరుల్లో అగ్రస్థానం తనదేనని చాటి చెప్పాడు. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ సెంచరీతో చెలరేగాడు. అసలు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అదే తొలి సెంచరీ.
షాన్ పొలాక్, ముఖయా ఎన్తిని, జాక్వెస్ కలిస్, మోర్నీ మోర్కెల్ వంటి ఉద్దండులైన బౌలర్లను చీల్చిచెండాడిన గేల్.. 26 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. తర్వాత మరింత రెచ్చిపోయిన గేల్ 50 బంతుల్లో సెంచరీ సాధించాడు. మొత్తం 57 బంతుల్లో 117 పరుగులు సాధిస్తే 10 సిక్స్‌లతోపాటు 7 ఫోర్లు బాదడం విశేషం. తొలివికెట్‌కు డెవాన్ స్మిత్‌తో కలసి 72 బంతుల్లోనే 145 పరుగులు జోడించాడు. అయితే తర్వాతి బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 205 పరుగులు చేసింది.
అప్పట్లో టీ20ల్లో 200 పరుగులను ఛేదించడమంటే దాదాపు అసాధ్యమే. అయితే గిబ్స్ ధాటికి ఆ స్కోరు చిన్నగా మారిపోయింది. 14 బౌండరీలు 2 సిక్స్‌లు బాదిన హెర్ష్‌లీ గిబ్స్..55 బంతుల్లో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడు జస్టిన్ కెంప్ (22 బంతుల్లో 46 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా చెలరేగడంతో దక్షిణాఫ్రికా 17.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 208 పరుగులు చేసింది.
2009 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్, నాథన్ బ్రాకెన్, జేమ్స్ హోప్స్, షేన్ వాట్సన్ వంటి అగ్రశ్రేణి బౌలర్లను ఆటాడుకున్నాడు. గేల్ ఇన్నింగ్స్‌తో 170 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 15.5 ఓవర్లలోనే ఛేదించిదంటే అతని విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. వార్నర్, వాట్సన్ రాణించడంతో ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వెస్టిండీస్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది.
తొలి బంతికే బౌండరీని బాదిన గేల్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ఆరంభించాడు. ఇక ఐదో ఓవర్‌లో వివ్వరూపం చూపాడు. అప్పటికీ ప్రపంచంలోనే భీకర బౌలర్‌గా పేరున్న బ్రెట్ లీ బౌలింగ్‌లో ఏకంగా 27 పరుగులు సాధించాడు. వరుసగా 6,0,6,0,4,4,6 (ఒక నోబాల్) బాదాడు. అగ్నికి వాయువు తోడైనట్లు గేల్‌కు ఆండ్రీ ఫ్లెచర్ జతకలిశాడు. 50 బంతుల్లో 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో గేల్ 88 పరుగులు చేయగా, ఫ్లెచర్ 32 బంతుల్లో 53 పరుగులు చేశాడు. వీరి ధాటికి వెస్టిండీస్ 8 ఓవర్లకే 100 పరుగులు చేసింది. 15.5 ఓవర్లలో 172 పరుగులు చేసి నెగ్గింది.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment