-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 19, 2016

టుడే న్యూస్ రిపోర్ట్...!!!


వ(జ)నజాతర: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిచెందిన మేడారం సమ్మక్క-సారక్క జాతర నేటితో మూడోరోజుకు చేరింది. శుక్రవారం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. మధ్యాహ్నం 12 గంటలకు సమ్మక్క- సారక్క గద్దెలను దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ లో ఇన్ఫోటెక్ సంస్థ ఏర్పాటుచేసిన ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభిస్తారు.

జీఎస్టీని ఏం చేద్దాం?: వివాదాస్పద వస్తు సేవల బిల్లు(జీఎస్టీ)ఆమోదం, సూచనలు, సవరణలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నేడు ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు ఢిల్లీ వెళతారు.

జేఎన్ యూ వివాదం: ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దేశద్రోహం కేసు కింద అరెస్టయిన కన్నయ్యకు పాటియాలా హౌస్ కోర్టు మార్చి 2 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కాగా,  ఇదే కేసు విచారణ సందర్భంగా పాటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో కొందరు లాయర్లు జర్నలిస్టులపై చేసిన దాడి ఘటనపై నమోదయిన కేసును కూడా సుప్రీం కోర్టులో నేడు విచారణకు రానుంది.

ముంబై: నేడు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరగనుంది.

టీటీడీ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటకలోని 7 ప్రాంతాల్లోనేడు వెంకటేశ్వర కల్యాణం నిర్వహించనున్నారు.

కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు.

కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ నేడు, రేపు ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటుచేసిన  ఏపీసీసీ భవనానికి ఆయన శంకుస్థాపన చేస్తారు.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu