-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 17, 2016

రేప్ అనంతరం సారీ అంటూ మెసేజ్..


డెర్బి: ఆన్ లైన్ డేటింగ్ సైట్ లో పరిచయమైన  ఐదుగురు మహిళలను ఓ వ్యక్తి రేప్ చేశాడు. ఆరో మహిళపై సైతం లైంగిక దాడికి ప్రయత్నించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని డెర్బీ ప్రాంతానికి చెందిన జాసన్ లారెన్స్(50)..  ప్రముఖ డేటింగ్ వెబ్ సైట్ మ్యాచ్ డాట్ కామ్ లో వేరు వేరు ప్రొఫైల్స్ తో అమాయక మహిళలకు వల వేశాడు. తనతో సంభాషణలు ప్రైవేట్ మెయిల్ లేదా ఫోన్ ద్వారా చేయాలని డేటింగ్ వెబ్ సైట్ ద్వారా పరిచయం అయిన మహిళలను కోరేవాడు. అలా తనతో ప్రైవేటు సంభాషణలు జరిపిన వారిని కలుసుకొని వారిపై లైంగిక దాడి పాల్పడ్డాడు. వ్యక్తిగత సంభాషణల ద్వారా తన నిజస్వరూపాన్ని మ్యాచ్ డాట్ కామ్ సైటు దృష్టిలో పడకుండా జాసన్ జాగ్రత్త పడ్డాడని  ప్రాసిక్యూటర్ షాన్ స్మిత్ తెలిపారు.

మూడు మిలియన్ల సభ్యులతో మ్యాచ్ డాట్ కామ్ కు బ్రిటన్‌లో అతి పెద్ద డేటింగ్ సైటుగా పేరుంది. ఈ సైట్ ద్వారా మొదటగా 2013 నవంబర్‌లో పరిచయమైన ఓ మహిళను జాసన్ తన ఇంట్లోనే రేప్ చేశాడు. ఇక మరో ఘటనలో తనను కలుసుకోవడానికి వచ్చిన మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇలా రేప్ లు చేసిన అనంతరం తాపీగా క్షమించమని మెసేజ్ లు పెట్టడం జాసన్ కున్న మరో అలవాటు. డెర్బీ క్రౌన్ కోర్టులో జాసన్ అకృత్యాలపై విచారణ జరుగుతోంది.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu