-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 22, 2016

యాక్టర్ అయిన డాక్టర్...?


ఒక డాక్టరు కావాలన్నా, లాయరవ్వాలన్నా, లేక వ్యాపార రంగంలో రాణించాలన్నా అందుకు సంబంధించి విద్యలో ఉత్తీర్ణత సాధించాలి. అయితే ఆయా రంగాలకు చెందిన వారు చాలా మంది సినిమా రంగంలో రాణించాలని ఆశించడం గమనార్హం. అలా డాక్ట రు పట్టాదారి అయిన భరత్ విజయ్ ఇప్పుడు యాక్టర్ అయ్యారు.అంతే కాదు కథకుడు,దర్శకుడు,నిర్మాత అంటూ ఏకకాలంలో బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఆ చిత్రాన్ని ఆడియో ఆవిష్కరణ వరకూ సక్సెస్‌ఫుల్‌గా తీసుకొచ్చారు.

 ఈయన ఇన్ని బాధ్యతల్ని నిర్వహించిన చిత్రం ఆరామ్ అరివు. సిక్స్ సెన్స్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ భరత్‌విజయ్ తెరకెక్కించిన ఈ చి త్రంలో నటి సహానా కథానాయకిగా నటించారు. ఆర్‌సీ.సుందర్, సురేఖ, దీపన్,లాలిత్య, వినోద్,రవిమణ్యం ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యామ్ ఎల్.రాజ్ సంగీతాన్ని అం దించారు.చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక టీ.నగర్‌లోని ఎంఎం థియేటర్‌లో జరిగింది.సీనియర్ దర్శకుడు వీసీ.గుహనాథన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా దర్శకనిర్మాత కలైపులి జీ.శేఖర్, విజయ మురళి తొలి సీడీ ని అందుకున్నా రు.

 వీసీ.గుహనాథన్ మాట్లాడుతూ చాలా మంది న టుడివి కాకుంటే ఏమై ఉండే వారంటే డాక్టర్ అయి ఉండేవాడినని చెబుతుంటారన్నారు.ఈ చిత్ర హీరో భర త్ విజయ్‌ని అలాంటి ప్రశ్న అడిగే అవకాశం లేదన్నారు.ఆ యన ఎంబీబీఎస్ చదివి, చిత్ర రంగం వైపు దృష్టి సారించి ముందు కథను తయారు చేసుకుని,ఆ తరువాత దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది తానే కథానాయకుడిగా నటిస్తూ,దర్శక నిర్మాత బాధ్యతల్ని చేపట్టారంటే ఆ చిత్రంలో తప్పకుండా మంచి విషయమే ఉండి ఉంటుందన్నారు. ఈ చిత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు గుహనాథన్ పేర్కొన్నారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu